మీసేవ సర్టిఫికెట్లు పొందండి ఇలా.. | - | Sakshi
Sakshi News home page

మీసేవ సర్టిఫికెట్లు పొందండి ఇలా..

Jun 3 2025 5:47 AM | Updated on Jun 3 2025 5:47 AM

మీసేవ సర్టిఫికెట్లు పొందండి ఇలా..

మీసేవ సర్టిఫికెట్లు పొందండి ఇలా..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ప్రవేశాలు, దరఖాస్తుల కోసం విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు తప్పనిసరి. వీటి కోసం మీసేవ కేంద్రాల్లో ఏవిధంగా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి? అనే వివరాలు మీ కోసం..

కులం (క్యాస్ట్‌) సర్టిఫికెట్‌

● ఆధార్‌తోపాటు టెన్త్‌ మెమో లేదా బోనాఫైడ్‌/ పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ జత చేయాలి.

● దరఖాస్తుదారునిది పాత కులం సర్టిఫికెట్‌ లేదా కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా ఒకరిది.

ఆదాయం (ఇన్‌కమ్‌) సర్టిఫికెట్‌

● ఆధార్‌ కార్డు /ఓటరు కార్డు, రేషన్‌ కార్డు

● ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో

నివాస సర్టిఫికెట్‌

● ఆధార్‌కార్డు /ఓటరు కార్డు / ఇంటిపన్ను రసీదు/ కరెంట్‌ బిల్లు

● ఒక పాస్‌ పోర్టు సైజు ఫొటో

పె ధృవపత్రాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు మీసేవ కేంద్రాల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తయిన తర్వాత ఆ ఫారాన్ని స్థానిక తహసీల్‌ కార్యాలయంలో అందజేయాలి. అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులోపు ఆమోదిస్తారు. అనంతరం మీ సేవ కేంద్రంలోనే సర్టిఫికెట్‌ ప్రింట్‌ తీసుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement