జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌

Jun 1 2025 1:33 AM | Updated on Jun 1 2025 1:33 AM

జెన్‌

జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జెన్‌కో, ప్రాజెక్టు అధికారుల మధ్య శనివారం స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మ్యాచ్‌ నిర్వహించారు. మ్యాచ్‌లో ప్రాజెక్ట్‌ అధికారుల జట్టు విజయం సాధించిగా, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ ఈఈ చక్రపాణి, జెన్‌కో డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ ఆస్పత్రిలో విచారణ

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో రోగి రాధిక మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అంజనాదేవి శనివారం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగి మృతిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగి ఆస్పత్రికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందని, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగికి చేసిన పరీక్షలను పరిశీలించారు. సర్జరీ సమయంలో వైద్యులు ఎలాంటి వైద్యం అందించారో పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. సర్జరీ చేసిన వైద్యుల అర్హత, ఎన్ని సంవత్సరాల అనుభవం తదితర వివరాలను తనిఖీ బృందం సభ్యులు క్షుణ్ణంగా ఆరా తీశారు. ప్రతిభ ఆస్పత్రిలో రోగి మృతి చెందిన ఘటనపై పూర్తి నివేదికను డీఎంహెచ్‌వోకు సమర్పిస్తామని డిప్యూ టీ డీఎంహెచ్‌వో అంజనాదేవి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటేశ్‌, డీహెచ్‌ఈ వేణుగోపాల్‌, హెచ్‌ఈవో గోవర్ధన్‌ పాల్గొన్నారు.

యోగాతో మానసిక ఒత్తిడి దూరం

ప్రభుత్వ వైద్య కళాశాల

ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శివప్రసాద్‌

నిజామాబాద్‌నాగారం: యాంత్రీకరణ జీవనంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను శనివారం జీజీహెచ్‌లో జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ జే గంగదాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కోపం, డిప్రెషన్‌ తదితర వాటిని ఎలా నియంత్రించగలమో వివరించారు. అంతకుముందు యోగ శిక్షకులు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో యోగా వైద్యులు డాక్టర్‌ తిరుపతి, ఆయుష్‌ ఫార్మాసిస్ట్‌లు పురుశోత్తం, ఉమ్యాప్రసాద్‌, నీరజ, యోగా శిక్షకులు విజయ భాస్కర్‌, రాజేందర్‌, నమ్రత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌1
1/2

జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌

జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌2
2/2

జెన్‌కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement