మాకూ.. బతకాలని ఉంటుంది | - | Sakshi
Sakshi News home page

మాకూ.. బతకాలని ఉంటుంది

May 30 2025 1:42 AM | Updated on May 30 2025 1:42 AM

మాకూ.

మాకూ.. బతకాలని ఉంటుంది

కీటకాల మనోవ్యథ

హాయ్‌ అండీ...

మేము నోరు లేని చిన్నపాటి జీవాలం..మాకూ భూమిపై బతకాలని ఆశగా ఉంటుంది.. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మీరు సంతోషంగా ఉంటారని తెలుసు.. మీరెంత సంతోషంగా ఉంటారో మేమంత బాధలో ఉంటామని మీకు తెలుసా? కారణం వర్షాలతో మా నివాసాల్లోకి నీరు చేరడంతో రోడ్డుపైకి చేరుతాము. రోడ్డును దాటుతున్న తరుణంలో మీ వాహనాల చక్రాల కింద దాక్కున్న యముడు కన్నెర్రజేసి కనికరం లేకుండా యమపాశాన్ని ప్రయోగిస్తున్నాడు. మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని ఆ యముడు మమ్మల్ని తన లోకానికి తీసుకెళ్తున్నాడు. ఎన్నటికై నా..అక్కడికే వెళ్లాల్సిందే. కానీ కొన్ని రోజులు మీ మాదిరిగానే మా తల్లిదండ్రులు, బంధువులు, ఆప్తులతో గడపాలని మాకూ కోరికగా ఉంటుంది. – నవీపేట

కనికరం లేకుండా ఆత్మలేని నా(తాబేలు) దేహాన్ని

భుజిస్తున్న నాతోటి జీవి కాకి

విష సర్పాలమని చక్రాల కింద నలిపేశారు

హమ్మయ్య.. నేను, నా(నత్త) పిల్లలు బ్రతికిపోయాం..

బహుశా నా(తేలు)లో విషముందని చంపేశారేమో..

నేనేం(బూగ) పాపం చేశానని ఈ శిక్ష విధించారు

నడుం కాళ్లు విరిగి నేను(కప్ప) ఎలా బతకాలి..

మాకూ.. బతకాలని ఉంటుంది 1
1/5

మాకూ.. బతకాలని ఉంటుంది

మాకూ.. బతకాలని ఉంటుంది 2
2/5

మాకూ.. బతకాలని ఉంటుంది

మాకూ.. బతకాలని ఉంటుంది 3
3/5

మాకూ.. బతకాలని ఉంటుంది

మాకూ.. బతకాలని ఉంటుంది 4
4/5

మాకూ.. బతకాలని ఉంటుంది

మాకూ.. బతకాలని ఉంటుంది 5
5/5

మాకూ.. బతకాలని ఉంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement