
నందిపేటలో విజేత జట్లతో ఖోఖో సంఘం ప్రతినిధులు
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని లక్కంపల్లి శి వారులో మూడు రోజులుగా జరుగుతున్న 42వ రా ష్ట్రస్థాయి జూనియర్ ఇంటర్ బాలబాలికల ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మ డి 10 జిల్లాలు ప్రాతినిథ్యం వహించి క్రీడల్లో పాల్గొన్నారు. ఇందులో బాలుర జట్లలో రంగారెడ్డి (మొదటి), వరంగల్(రెండవ), హైదరాబాద్ (మూడవ), నిజామాబాద్(నాల్గవ) స్థానాలు కై వసం చేసుకున్నా యి. బాలికల జట్లలో హైదరాబాద్(మొదటి), న ల్గొండ(రెండవ), రంగారెడ్డి(మూడవ), నిజామాబాద్ (నాల్గవ) స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రజట్టుకు ఎంపికైన విద్యార్థులు చత్తీస్‌గడ్‌లో జాతీయ టోర్నీ లో పాల్గొంటారని జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కా ర్యదర్శి అతిఖుల్లా తెలిపారు. రాష్ట్ర ఖోఖో సంఘం జనరల్ సెక్రటరీ నాతి కృష్ణమూర్తి, రాష్ట్ర ఒలింపిక్ అబ్జర్వర్ లింగన్న, ప్రశాంత్, జిల్లా ఒలింపిక్ అబ్జర్వర్ బొబ్బిలి నర్సయ్య, టోర్నీ కన్వీనర్ సాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సుజాత ఉన్నారు.