
హ్యాట్సాఫ్.. మేడం
కడెం: తాను విధులు నిర్వహించిన పాఠశాలపై మమకారంతో.. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు ఓ ఉపాధ్యాయురాలు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో 2012 నుంచి 2024 వరకు హిందీ టీచర్‌గా విధులు నిర్వహించిన విజయలక్ష్మి గతేడాది మామడ మండలం పొన్కల్ పాఠశాలకు పదోన్నతిపై వెళ్లారు. 12 ఏళ్లు విధులు నిర్వహించిన కడెం పాఠశాల, ఇక్కడి విద్యార్థుల ను మరువని ఉపాధ్యాయురాలు తన తల్లిదండ్రులు కళావతి–విఠల్‌రావు జ్ఞాపకార్ధం రూ.1.20 లక్షలతో పాఠశాలలో ఆర్వోవాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గురువారం ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని సత్కారించారు.