
తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరం
కుంటాల: తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని డీపీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. తల్లిపాల వారో త్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం కుంటాల, ఓలా ఉన్నత పా ఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించా రు. తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో వన జ, ఎంఈవో ముత్యం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.