
జీవితం పేదల కోసమే..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా. పేదలకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేశా. నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నా. నిత్యం 300 నుంచి 400 మంది ఆయా సేవల నిమిత్తం వస్తుంటారు. చివరి పేషెంట్ వరకు ఏరోజుకు ఆరోజు స్కానింగ్ చేయడంతో పాటు రిపోర్టులు తయారు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. సేవలకు గుర్తింపుగా కలెక్టర్, మంత్రుల చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నా.
– నూతుల కళ్యాణ్‌రెడ్డి, ప్రొఫెసర్, రిమ్స్
ప్రజలకు సేవ చేయాలని..
ఆదిలాబాద్‌టౌన్: వరంగల్‌లోని కేఎంసీలో వైద్య విద్య అభ్యసించా. ఢిల్లీలో పీజీ పూర్తి చేశా. అక్కడే అంబేడ్కర్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించా. జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించాలని తండ్రి శ్రీరాములు కోరిక మేరకు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్యునిగా చేరారు. నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నా. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా.
– డాక్టర్ ఆడె విఠల్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్

జీవితం పేదల కోసమే..