
25 ఏళ్ల అనుభవం..
1995లో గాంధీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, 1998లో ఎండీ, పిడియాట్రీషన్ పూర్తిచేశా. మూడేళ్లపాటు నిజామాబాద్‌లో పిల్లల వైద్యునిగా పనిచేశా. 2012లో నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైనప్పటి నుంచి వివిధ హోదాలలో సేవలు అందించా. గతేడాది నుంచి నిర్మల్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టా. ఈ 25 ఏళ్ల అనుభవంలో ఎంతో మందికి సేవలు అందించా. పేదలకు సేవ చేయడం గొప్పగా భావిస్తున్నా.
– డాక్టర్ గోపాల్‌సింగ్, సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆసుపత్రి, నిర్మల్
వైద్యసేవలు అందించాలనే..
పేదలకు వైద్యసేవలు అందించాలనే వైద్యవృత్తిని ఎంచుకున్నా. 25 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నా. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమయ్యే వసతులు, వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. వైద్యవృత్తి సేవా దృక్పధంతో ముడిపడి ఉంటుంది. డబ్బుల కోసమే కాకుండా స్వచ్ఛందంగా వైద్య సేవలందించాలి.
– డాక్టర్ కాశీనాథ్,
సూపరింటెండెంట్, భైంసా ఏరియా ఆసుపత్రి

25 ఏళ్ల అనుభవం..