తనిఖీలకు కమిటీలు | - | Sakshi
Sakshi News home page

తనిఖీలకు కమిటీలు

Jul 1 2025 3:57 AM | Updated on Jul 1 2025 3:57 AM

తనిఖీ

తనిఖీలకు కమిటీలు

నిర్మల్‌
● పక్కాగా సర్కారు స్కూళ్ల పర్యవేక్షణ ● ప్రత్యేక బృందాల భర్తీకి ఉత్తర్వులు ● బోధన పర్యవేక్షణకు మరో వ్యవస్థ ● అభ్యంతరం తెలుపుతున్న సంఘాలు

మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025

సామాన్యులకు పోలీసులు

అండగా ఉండాలి

నిర్మల్‌టౌన్‌: సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ జానకీ షర్మిల పోలీసు అధి కారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించి జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మా ట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

రిటైర్డ్‌ ఎస్సైకి సన్మానం

భైంసా టౌన్‌ ఎస్సైగా పని చేసి రిటైర్డయినా ఎండీ గౌస్‌ను జిల్లా కేంద్రంలోని ప్రధాన పో లీస్‌ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల స త్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేంద్రరెడ్డి, రాజేశ్‌మీనా, ఏవో యూనిస్‌ ఆలీ, ఆర్‌ఐలు రామ్‌ నిరంజన్‌, శేఖర్‌, రమేశ్‌ ఉన్నారు.

నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియ తీరును పర్యవేక్షించేందుకు మరో కొత్త వ్య వస్థ ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చు ట్టింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీ న్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, నోడల్‌ అ ధికారులు, డీఈవోలు, అకాడమిక్‌ మానిటరింగ్‌ అ ధికారులు, సెక్టోరియల్‌ అధికారులు వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విద్యాశాఖ పాఠశాలలవారీగా బోధన తీరు, విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించేందుకు ఉపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటు చేయనుంది.

పర్యవేక్షణ బృందాల విధులు

విద్యాశాఖ తాజాగా నియమించనున్న తనిఖీ కమి టీ సభ్యులు తమ పరిధిలో పాఠశాలలను పరిశీలి స్తారు. బోధనాభ్యసన ప్రక్రియ తీరు, మౌలిక వసతులు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, విద్యావిషయాక అంశాల అమలు, విద్యార్థులు, ఉపాధ్యాయు ల హాజరు తదితర విద్యా సంబంధిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. తనిఖీల్లో గుర్తించిన వివరాల ఆధారంగా నివేదికలు రూపొందించి ప్రతినెలా జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తారు. వీటిపై కలెక్టర్‌ సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారు.

ఇవీ.. మార్గదర్శకాలు

విద్య నాణ్యత పెంపునకు పాఠశాలలపై పర్యవేక్షణ బలపరచాలి. తనిఖీకి రెండు శాతం ఉపాధ్యాయులతో పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఉపాధ్యాయులకు కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం తప్పనిసరి. శిక్షణ, టెక్నాలజీలపై సరైన పరిజ్ఞానం అవసరం. శిక్షణ ఫలితాలపై దృష్టి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. పాఠశాలల్లో పాఠ్యాంశాలు, లెసన్‌ ప్లాన్‌ల ప రిశీలన, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, సహపాఠ్య కార్యకలాపాలు, స్పోర్ట్స్‌, డిజిటల్‌ ఎడ్యుకేష న్‌, ఆరోగ్య తనిఖీలు, టాయిలెట్లు, తాగునీరు, ప్ర హరీ, విద్యుత్‌, ఆడిటోరియం, ఆటస్థలం పరిశీల న, విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ పంపిణీ పరిస్థితి, ఫలితాలు, పాఠ్య ప్రణాళికల అమలుపై పరిశీలన చేయాలి.

టీచర్స్‌ యూనియన్ల అభ్యంతరం

పాఠశాలల పర్యవేక్షణ తనిఖీల కోసం ఇప్పటికే అనేక రకాల వ్యవస్థలు ఉండగా మళ్లీ ఉపాధ్యాయులతో కొత్త కమిటీలు నియమించే అంశంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్‌, మండల నోడల్‌ అధికారులు, మండల విద్యాధికారి, అకాడమీ మానిటరింగ్‌ ఆఫీ సర్‌, సెక్టోరియల్‌ అధికారులు లాంటి అనేక వ్యవస్థలు కొనసాగుతుండగా వీటికి సమాంతరంగా మరో కొత్త తనిఖీ వ్యవస్థ ఏర్పాటుపై అభ్యంతరం చెబు తున్నారు. ఉపాధ్యాయులను తనిఖీ కమిటీలోకి తీ సుకుంటే విద్యార్థులకు నష్టం చేకూరుతుందని, ఉ పాధ్యాయుల కొరత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. వెంటనే పర్యవేక్షణ కమిటీ నియామక ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, క్లస్టర్ల వివరాలు

జిల్లా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మొత్తం మండలాలు క్లస్టర్లు

నిర్మల్‌ 488 83 118 689 19 48

ఆదిలాబాద్‌ 455 102 109 666 21 71

మంచిర్యాల 480 95 108 683 18 51

కుమురంభీం 526 99 60 685 15 67

తనిఖీలకు కమిటీలు 1
1/1

తనిఖీలకు కమిటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement