ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Jul 1 2025 3:57 AM | Updated on Jul 1 2025 3:57 AM

ఫిర్య

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణికి వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి 105 అర్జీలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని అధికా రులకు సూచించారు. అనంతరం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌) పోస్టర్‌ ఆవి ష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఫై జాన్‌ అహ్మద్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలి

కలెక్టర్‌ కార్యాలయం నుంచి రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో విద్యుద్దీపాలు వెలగకపోవడంతో వివిధ పనుల రీత్యా నిర్మల్‌ పట్టణానికి వెళ్లే మహాలక్ష్మివాడ, డబుల్‌ బెడ్రూం, నాగనాయిపేట కాలనీవాసులం రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్నాం. వెంటనే సెంట్రల్‌ లైటింగ్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇప్పించి సమస్య పరిష్కరించాలి.

– నవీన్‌, మహాలక్ష్మివాడ

ఉద్యోగమిప్పించాలి

నేను 2024 డీఎస్సీలో పరీక్ష రాసి ఉత్తీర్ణుడనయ్యాను. తాండూరు మండలానికి చెందిన పాటిల్‌ అంబాదాస్‌ సంభాజీ ఐదోతరగతి నుంచి మహారాష్ట్రలో చదివాడు. 2012, 2018 డీఎస్సీలో అతడిని టీఎస్పీఎస్సీ నాన్‌ లోకల్‌ క్యాండెట్‌గా తిరస్కరించింది. కానీ, 2024 డీఎస్సీలో లోకల్‌ క్యాండెట్‌గా పరిగణించి నాకు రావాల్సి న ఉద్యోగం అతడికిచ్చారు. విచారణ చేపట్టి నాకు ఉద్యోగమిప్పించాలి.

– బీ నాగనాథ్‌, జవ్లా బీ, తానూరు

● ప్యాకేజీ 27లో గొల్లమడ గ్రామం మీదుగా 5.3 కిలో మీటర్ల మేర డ్రైన్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టగా గ్రామానికి చెందిన దాదాపు పదిన్నర ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని గొల్లమాడ రైతులు తెలిపారు. బ్రిడ్జి నిర్మించి ఏడాదైనా పరిహారం అందలేదని పేర్కొన్నారు. వెంటనే పరిహారం ఇప్పించాలని కోరారు.

● బేస్తవార్‌పేట కాలనీలోని రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు తెలిపారు. మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

● తమ గ్రామంలోని 249 సర్వే నంబర్‌లోగల ఎకరం భూమి చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి కేటాయించాలని ముధోల్‌ మండలం బోరిగం గ్రామ రజకులు కలెక్టర్‌ను కోరారు.

● రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తడోబా అందేరి రిజర్వ్‌ ఫారెస్ట్‌ను కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కలుపుతూ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌–ఆసిఫాబాద్‌ పరిధిలో 334 గ్రామాలను గజిట్‌లో పేర్కొంటూ తీసుకువచ్చిన జీవో 49ని, కుమురంభీం కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

● అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నుంచి పెండింగ్‌ వేతనాలు ఇప్పించాలని జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ హాస్పిటళ్లలో పని చేసే ఆరోగ్య మిత్రలు కోరారు. ఏజెన్సీ కాలపరిమితి పెంచి తాము ఉపాధి కోల్పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

వినతుల్లో మరికొన్ని..

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

ప్రజావాణికి 105 అర్జీలు

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి1
1/2

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి2
2/2

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement