
గోదావరిలో మట్టి కుప్పలు
● బాసర వద్ద తరచూ ప్రమాదాలు ● తొలగించాలని కోరుతున్న భక్తులు
భైంసా: బాసర గోదావరినది స్నాన ఘట్టాలపై మ ట్టి పేరుకుపోతోంది. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు తర చూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బాసర వద్ద గోదావరిపై రెండు కొత్త వంతెనలు నిర్మిస్తుండగా ఇందుకోసం నదిలో నల్లమట్టితో తాత్కాలిక రోడ్లు వేశారు. నీటి ప్రవాహం పెరిగినప్పుడల్లా తాత్కాలిక రోడ్ల మట్టితోపాటు పిల్లర్ల కోసం తీసిన గుంతల్లోని మట్టి కూడా దిగువకు కొట్టుకువచ్చి స్నానఘట్టాల వద్ద పేరుకుపోతోంది. రెండేళ్లుగా ఇదే పరిస్థి తి ఉంటోంది. గోదావరినదిలో వివిధ రూపాల్లో కొ ట్టుకువచ్చిన మట్టి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చేరి అందులో పూడిక పెరుగుతోంది. నదిలో వేస్తున్న వ్యర్థాలు, నల్లమట్టి, బండరాళ్లు కొట్టుకువచ్చి ఎస్సారెస్పీలో పూడికకు కారణమవుతున్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, పూడి క కారణంగా 80 టీఎంసీలకు పడిపోయింది. మంగళవారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తుతున్నారు. ప్రాజెక్ట్‌లోని నీరు గోదావరిలో చేరి ప్రవా హం మరింత పెరగనున్నందున వంతెనల వద్ద తా త్కాలిక రోడ్ల కోసం వేసిన నల్లమట్టి మరింత కొట్టుకువచ్చి బాసర గోదావరి స్నానఘట్టాలను ముంచెత్తనుంది. ఇప్పటికై నా అధికారులు నదిలో మట్టి, చెత్తాచెదారం వేయకుండా చర్యలు చేపట్టాలని, బాసర గోదావరినది స్నానఘట్టాల వద్ద ఉన్న మట్టి కుప్పలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు.