
ఆసరా.. ఏదయా?
చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు చవాన్ సోమల. కుభీర్ మండలం కసర గ్రామానికి చెందిన సోమల ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పింఛన్ తీసుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే పెన్షన్ విధానం తెచ్చింది. దీంతో సోమల పెన్షన్ కట్‌చేసి ఆయన భార్య తిత్రీబాయికి వితంతు పెన్షన్ రూ.2 వేలు మంజూరు చేసింది. సోమల బతికి ఉండగానే వితంతు పింఛన్ మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం తిత్రీబాయి మరణించింది. ఆమె తర్వాత తనకు వద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని సోమల అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. కానీ, ఆన్‌లైన్‌లో అతను చనిపోయినట్లు నమోదైంది.