
ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ కొట్టె శేఖర్ కోరారు. ఫో రం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వ ద్ద శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శేఖర్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఒక కమిషన్ వేసి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని కోరారు. ప్రతీ ఉద్యమకారునికి 25 చదరపు గజాల స్థలం, గృహ నిర్మాణానికి రూ.10 లక్షల సాయం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీ, రూ.25వేల పెన్షన్, ఉద్యమంలో సర్వం కోల్పోయిన విద్యార్థి ఉద్యమకారులకు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనను నిరసిస్తూ జూలై 2నుంచి సెప్టెంబర్ 17వరకు ఫోరం ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా శాంతిదీక్ష చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఫోరం నాయకులు సామ కిరణ్‌రెడ్డి, పా కాల రాంచందర్, సామల వీరయ్య, వెంకట్‌రామ్‌రెడ్డి, నర్సయ్య, గోపి, గంగన్న, ఇస్మాయిల్, శివాజీ, దేవిదాస్, వినోద్, జగన్, షరీఫ్, సాయన్న, చంద్రశేఖర్, భూమేశ్, శంకర్, విద్యాసాగర్‌రెడ్డి, కిషన్, నవీన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.