
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజేందర్ సిబ్బందిని కోరారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్‌కు వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రై డే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని సూచించా రు. వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జా గ్రత్తల గురించి వివరించారు. ఆయుష్మాన్ ఆ రోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో కార్యక్రమ నిర్వహణాధి కారి డాక్టర్ రాజారమేశ్, డాక్టర్ సౌమ్య, డి ప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి భా రె రవీందర్, డీడీఎం ముత్యం, డీపీవో రామచందర్, పీహెచ్‌ఎన్‌వో విమల పాల్గొన్నారు.
మాట్లాడుతున్న రాజేందర్