
ఘనంగా అకాడి పూజలు
ఆషాడమాసం ప్రారంభంతో ఆదివాసీ గ్రామాల్లో అకాడి పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇచ్చోడ మండలం బాదిగూడతోపాటు ఇంద్రవెల్లి మండలం సమాక, కేస్లాపూర్, పాటగూడ, ముత్నూర్ గ్రామాల ఆదివాసీలు పొలిమేరకు వెళ్లి వనదేవతలకు పూజలు చేశారు. సంప్రదాయ వంటలు తయారు చేసి నైవేద్యాలు సమర్పించారు. ప్రజలతోపాటు పంటలు, పశుపక్ష్యాదులు బాగుండాలని మొక్కినట్లు గ్రామాల ఆదివాసీ పెద్దలు తెలిపారు. గ్రామాల పెద్దలు కొరెంగా యేశ్వంత్‌రావ్ మహారాజ్, పెందోర్ భగ్వంత్‌రావ్, జంగు, లక్ష్మణ్, సోయం భీంరావ్, గ్రామపటేల్ సిడాం లక్ష్మికాంత్, దేవారి పెందుర్ బండు, గ్రామస్తులు తులిసిరాం, చిక్రం దేవ్‌రావు, పంద్రం రాజు, మెస్రం అమృత్‌రావు, సిడాం మధుకర్ తదితరులు పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి/ఇచ్చోడ

ఘనంగా అకాడి పూజలు