
బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి
పాతమంచిర్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్, వి శ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. మంచిర్యాలలోని చార్వాక భవన్‌లో జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన బీసీ చైతన్య సదస్సులో ఆ యన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన 30 రోజు ల వ్యవధిలో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అఖిలపక్షాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్పించే బాధ్యత కేంద్రానితే అని తెలిపారు. అగ్రవర్ణాల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లును అఘమేఘాల మీద చక్కబెట్టిన కేంద్రం అదే రీతిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో కుల గణన సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బీసీ మేధావుల ఫోరం అధ్వర్యంలో చేపట్టే పోరాటాలను ఉమ్మడి జిల్లా బీసీలు విజయివంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ బడి నిర్వాహకులు పిడికిలి రాజు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వీరస్వామి, అవ్వారు వేణుకుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కార్యదర్శి వేముల అశోక్, విశ్రాంత ఎంఈవో కొండయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్‌గౌడ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.