నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 30 2025 3:51 AM | Updated on Jun 30 2025 3:51 AM

నిర్మ

నిర్మల్‌

తెరుచుకోనున్న ‘బాబ్లీ’ గేట్లు

గోదావరినదిపై మహారాష్ట్రలో అక్రమంగా ని ర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకోనున్నా యి. త్రిసభ్య కమిటీ సభ్యులు రేపు 14 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు.

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

గజ్జలమ్మదేవికి పూజలు

కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జ లమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు అర్చకులు అభిషేకం, అలంకరణ, అర్చన, హా రతి నిర్వహించారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్‌, ధర్మాబాద్‌, బోకర్‌, అప్పారావుపేట్‌ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్య లో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. గజ్జ లమ్మ పల్లకీ సేవలో పాల్గొన్నారు. తలనీలాలు, ఎత్తు బెల్లం, బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదం పంపిణీ చేశారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పో టీ చేయాలనే ఆరాటం.. మరోవైపు తమకు పట్టున్న గ్రామం, వార్డు రిజర్వేషన్‌ ఎలా ఉంటుందోనన్న ఆందోళన.. ఇవన్నీ ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చే స్తున్నాయి. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. గ్రామపంచాయతీలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలియడంతో గ్రామ, మండ ల స్థాయి నాయకులంతా రిజర్వేషన్లు అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు.

16 నెలలుగా ‘ప్రత్యేక’ పాలన

2019లో జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు ఎ న్నికలు నిర్వహించగా.. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పా లకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. దీంతో 16 నెలలుగా పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇ టీవల హైకోర్టు సెప్టెంబర్‌ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించగా ఆ దిశగా ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి ఏడాది దగ్గర పడుతోంది. 2024 జూలై మొదటి వారంలో వీరి పదవీకాలం ముగిసింది. ఇప్పటివరకు పర్సన్‌ ఇన్‌చార్జీల పాలనలోనే జిల్లా, మండల పరిషత్‌లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నెల రోజుల్లో తేలనున్న లెక్కలు

హైకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో వా ర్డులు, సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 400 గ్రామపంచాయతీ లున్నాయి. గత ఎన్నికల్లో 396 పంచాయతీలకు ఎ న్నికలు జరిగాయి. ఇటీవల కడెం మండలంలోని న్యూధర్మాజీపేట్‌, ఖానాపూర్‌ మండలంలోని రంగపేట, తానూరు మండలంలోని కళ్యాణి, కుభీర్‌ మండలంలోని రంజనీతండాను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మొత్తం 400 పంచాయతీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాల కు రిజర్వేషన్లు ఖరారయ్యాక గ్రామాల్లో రాజకీయం మరింత వేడెక్కనుంది. త్వరలోనే ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించనున్న ట్లు తెలుస్తోంది. జిల్లాలోని 157 ఎంపీటీసీ స్థానా లకు 2019 మే నెలలో ఎన్నికలు నిర్వహించారు. మే 2024లోనే పాలకవర్గాల గడువు తీరిపోయింది. ఈ ఎన్నికలతో పాటే జిల్లాలోని 18 జెడ్పీటీసీ స్థానా లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.

న్యూస్‌రీల్‌

ఆశావహుల తంటాలు..

రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని కీలక నాయకులు, మండలాల్లో పట్టు న్న నేతలు తమ అనుచరులను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఏ సామాజికవర్గానికి రిజర్వేషన్‌ వస్తుందో ఇప్పుడే తేలకపోవడంతో అన్ని సామాజికవర్గాలకు చెందిన అనుచరులను తమ వెంట తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. రిజర్వేషన్‌ అనుకూలంగా వస్తే తానే బరిలోకి దిగేలా.. వేరే సామాజికవర్గానికి రిజర్వేషన్‌ వస్తే ఆ సామాజికవర్గానికి చెందిన తమ అనుచరుడిని రంగంలోకి దింపేలా సన్నాహాలు చేసుకుంటున్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు!

సమరోత్సాహంలో ఆశావహులు

గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం

రిజర్వేషన్ల కోసం తప్పని నిరీక్షణ

రిజర్వేషన్ల చిక్కుముడి వీడేనా?

పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వార్డులు, సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్ల మార్పుతో సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీ చట్టం–2018ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం చేసిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. అంటే ఈసారి కూడా గత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఖరా రుపై బీసీ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం కానుంది. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

నిర్మల్‌1
1/1

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement