
రిలే దీక్ష విరమణ
భైంసాటౌన్: ముధోల్ మండలం బోరిగాంలో బుద్ధ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని నెలరోజులకుపైగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం విరమించా రు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ దీక్షాపరుల కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విగ్రహ పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో దీక్ష విరమించినట్లు చెప్పారు. దీక్షకు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు దేవిదాస్ హస్డే, ఉపాధ్యక్షుడు దిగంబర్, శ్రీరాములు, శంకర్ చంద్రే, ప్రసంజిత్ ఆగ్రే తదితరులున్నారు.