
చిన్నారులతో ఆటవిడుపు
నిర్మల్ రూరల్/నిర్మల్‌ఖిల్లా: జిల్లా స్థాయి అధి కారి అంటేనే నిత్యం తనిఖీలు, సందర్శనలు, సమీక్షలతో బిజీబిజీగా ఉంటారు. డీఈవో రా మారావు ఆదివారం కూడా జిల్లా కేంద్రంలోని కురన్నపేటలోగల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కలిసిపోయి వాలీబాల్ ఆడారు. వారితో ముచ్చటిస్తూ బడిలోని వసతులు, విద్యావిధానం గురించి తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డ్యూటీ ఉ పాధ్యాయుడు రవి, వంట సిబ్బంది ఉన్నారు.