
ఘనంగా తాతాయి పండుగ
సారంగపూర్: మండలంలోని జామ్, స్వర్ణ, ధ ని, ఆలూరు, కంకెట, వైకుంఠాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం పూర్వీకులైన తాతా ఆ యిల పండుగలను ఘనంగా జరుపుకొన్నారు. కుమ్మరి కులస్తులు మట్టితో తాత ఆయి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తాతాయి ఆలయంలో వి గ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. వర్షాలు స మృద్ధిగా కురవాలని, పంటలు చక్కగా పండాలని వేడుకున్నారు. గ్రామ పెద్దలు రాజేశ్వర్, గ డ్డల అశోక్, వాసాల అశోక్, సుకానంద్, విలా స్, నలిమెల ముత్యం, రాజేశ్వర్, ఆడెపు మ హేందర్, గొల్ల మహేందర్ తదితరులున్నారు.