
‘గడ్డెన్న’ నీరు.. గోదారి పాలు
● నత్తనడకన ఆధునికీకరణ పనులు ● ఖరీఫ్‌నకు ప్రాజెక్ట్ నీరు అందేనా? ● ఆందోళనలో ఆయకట్టు రైతులు
లోకేశ్వరం: పద్నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్షంగా భైంసా సమీపంలో నిర్మించిన గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌లోని నీరు గోదారి పాలవుతోంది. తమ భూముల్లో బంగారు పంటలు పండుతాయని ఆయకట్టు రైతులు కన్న కలలు కల్లలయ్యా యి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినా ‘లక్ష్యం’ నీరుగా రుతోంది. మూడేళ్లుగా ప్రాజెక్ట్‌లోకి సామర్థ్యానికి మించి నీరు వస్తున్నా ఆయకట్టు భూములకు మా త్రం చుక్క నీరు అందడం లేదు. దేవుడు వరమిచ్చి నా పూజారి కరుణించని చందంగా తయారైంది ఆ యకట్టు రైతుల పరిస్థితి. భైంసా, లోకేశ్వరం మండలాల్లోని 11గ్రామాల్లో 14వేల ఎకరాల బీడు భూ ములను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్ట్ ప్రధా న కాలువ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను 2006 అక్టోబర్ 15న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. 42కిలోమీటర్ల పొడవున్న ఈకాలువపై 40 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించా రు. భైంసా మండలంలోని వాలేగాం, కుంసర, కా మోల్ గ్రామాల్లోని నాలుగు వేల ఎకరాలు, లోకేశ్వ రం మండలంలోని పుస్పూర్, పొట్‌పల్లి (ఎం), సా థ్‌గాం, హథ్‌గాం, బిలోలి, హవర్గ, లోకేశ్వరం, మ న్మద్, కిష్టాపూర్, భాగాపూర్, రాజూరా, ఎడ్ధూర్ తది తర గ్రామాల్లో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధాన కాలువకు గండ్లు పడి పి చ్చిమొక్కలతో అధ్వానంగా తయారైంది. దీంతో గ డ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీరు వృథాగా గోదావరిలో కలి సిపోతోంది. సంబంధిత అధికారులు ఏడేళ్లుగా చివ రి ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోయారు.
డిస్ట్రిబ్యూటరీలు కనుమరుగు
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కింద 40 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించారు. లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన ఈ డిస్ట్రిబ్యూటరీలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఫలానా చోట డిస్ట్రిబ్యూటరీ ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిస్ట్రిబ్యూటరీ వెంట నిర్మించిన సిమెంట్ నిర్మాణా లూ కనిపించకుండా పోయాయి. పలుచోట్ల రైతులు వాటిని దున్ని సాగుభూమిలో కలుపుకొన్నారు.
ప్రారంభించి 19 ఏళ్లయినా..
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రారంభించి 19 ఏళ్లయినా చి వరి ఆయకట్టు వరకు చుక్కనీరు అందలేదు. లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లీ, లోకేశ్వరం, హ థ్‌గాం, సాథ్‌గాం, కిష్టాపూర్, మన్మద్, రాజురా గ్రా మాల ఆయకట్టుకు నీరు అందడంలేదు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కాలువలకు గండ్లు పడ్డా యి. కాలువల ద్వారా వచ్చిన నీరు వృథాగా పో తోంది. ఈసారైనా ఖరీఫ్‌నకు సాగునీరు అందుతుందో.. లేదోనన్న సందిగ్ధంలో రైతులున్నారు.
గడ్డెన్నవాగు ప్రాజెక్ట్

‘గడ్డెన్న’ నీరు.. గోదారి పాలు