
ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం
నిర్మల్‌చైన్‌గేట్: జాతీయ గణాంక దినోత్సవా న్ని ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గణాంక శాస్త్ర ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ పీసీ మహాలనోబీస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి ల్లా ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం మా ట్లాడారు. దేశానికి బలమైన గణాంక మౌలిక వ్యవస్థను రూపొందించడంలో ప్రొఫెసర్ మ హాలనోబీస్ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతీ సంవత్సరం ఆయన జయంతి జూన్ 29న జా తీయ గణాంక దినోత్సవంగా జరుపుకొంటా మని తెలిపారు. అనంతరం 2023–24 సంవత్సరానికి సంబంధించిన జిల్లా గణాంక హ్యాండ్‌బుక్ ఆవిష్కరించారు. రిటైర్డ్ గణాంక శాఖ అధికారులు మోహన్‌దాస్, హన్మాండ్లు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు రమేశ్, జిల్లా గణాంకశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
680 అడుగులకు
‘కడెం’ నీటిమట్టం
కడెం: కడెం ప్రాజెక్ట్ నీటిమట్టం 680 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌లోకి ఆదివారం 769 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికా రులు తెలిపారు. గతేడాది జూన్ 29న ప్రాజెక్ట్ నీటిమట్టం 677.200 అడుగులుగా ఉంది.

ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం