
దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి
ఖానాపూర్: నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం జూ లై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సు రేశ్ కోరారు. ఆదివారం మండలంలోని బీర్నంది గ్రామంలో నిర్వహించిన సీఐటీయూ మండల కమి టీ సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చింద ని తెలిపారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు ప్ర యోజనం చేకూర్చేందుకు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. అంతకుముందు గ్రామంలో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగామణి, నాయకులు స్వప్న, లక్ష్మి, స్వామి, లత, రవి, వెంకటేశ్, నాగరాజు, మంగ, సుజాత పాల్గొన్నారు.