
పోరాటాలతోనే విద్యారంగం బలోపేతం
నిర్మల్‌ఖిల్లా: పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తపస్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జి గోనెల శశిరాజ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ డీఏ విడుదల, 317 స్థానికత సమ స్య పరిష్కారం, సీపీఎస్ రద్దు, జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తదితర సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్‌కుమార్, సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జిలక రి రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, వాసుదేవారెడ్డి, కృష్ణవే ణి, అజయ్, అరుణ్, శ్రీనివాస్ తదితరులున్నారు.