
ట్రక్ షీట్‌నే పరిగణనలోకి తీసుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పా టు చేసిన రైతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన సమయంలో ట్రక్ షీట్‌లలో నమోదుచేసి న ధాన్యం బరువునే పరిగణనలోకి తీసుకోవాలని భా రతీయ కిసాన్ సంఘ్ నాయకులు కోరారు. మిల్లర్లు తమకు నచ్చిన విధంగా తరుగు చూపిస్తూ, తమ ఇష్టా రీతిన వ్యవహరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు తరుగులో అక్రమాలను నిరసిస్తూ శనివారం కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యం అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రం వద్ద రాసిన ట్రక్ షీట్‌కి, రైస్ మిల్లర్లు ఇచ్చే ట్రక్ షీట్‌కి మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు. వెంటనే ప్రభుత్వ మోసాలను అరికట్టాలని కోరారు. నిరసనలో భారతీయ కిసాన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓస రవీందర్, కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి రాంగోపాల్‌రెడ్డి, సంపర్క్ ప్రముఖ్ కె.రాజేశ్వర్‌రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.