
అర్థవంతంగా బోధించాలి
నర్సాపూర్(జి): విద్యార్థులకు అర్థవంతంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్ సూచించారు. మండలంలోని బామ్ని(బి)లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్‌ను శనివారం పరిశీలించారు. జీపీ రికార్డులు తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. కేంద్రంలో చిన్నారులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మివిశారద, పంచాయతీ కార్యదర్శి గంగజల, అంగన్‌వాడీ కార్యకర్త ఉన్నారు.