
పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు
ముధోల్: వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదేశించారు. ముధోల్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఆయా ప్రధాన కాలనీలకు వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో డయేరియా, డెంగీ, విష జ్వరాలు అపరిశుభ్రత, కలుషిత నీటి కారణంగా ప్రబలుతాయన్నారు. చెత్త డ్రెయినేజీల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట డీఎల్‌పీవో సుదర్శన్, ఎంపీడీవో శివకుమార్, పంచాయతీ ఈవో అన్వర్ అలీ ఉన్నారు.