
పెండింగ్ వేతనాల కోసం పంచాయతీ కార్మికుల వినతి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. పెండింగ్ జీతాల విడుదల, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు కలెక్టరేట్ ఏవో, డీపీవోకు గ్రామపంచాయతీ కార్మికులు శనివారం నోటీసులు అందించారు. కేంద్రం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, లాభాల కోసం కార్మికవర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ఉపాధ్యక్షుడు రవి, మల్లేశ్, నాయకులు నర్సయ్య, మొగిలి, రాజేందర్, భూమన్న, వనిత, బుర్రవ్వ పాల్గొన్నారు.