
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
● ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి
నిర్మల్‌టౌన్: నిర్మల్ నుంచి ఏ పుణ్యక్షేత్రానికై నా ఆర్టీసీ బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ పండరి తెలిపారు. శుక్రవారం నిర్మల్ నుంచి రామేశ్వరా నికి బయల్దేరిన బస్సును ప్రారంభించారు. ఈ బస్సు కాణిపాకం, అరుణాచలం, పళని, పాతాళ శెంబు, ధనుష్కోటి, రామేశ్వరం వెళ్లి తిరిగి నిర్మల్‌కు జూలై 2న వస్తుందని పేర్కొన్నారు. మళ్లీ అరుణాచలం, రామేశ్వరం బస్సు జూలైలో ఉంటుందని తెలి పారు. జూలై చివరి వారంలో ప్రయాగ్రాజ్, వారణా సి, అయోధ్య, భద్రాచలం, అన్నవరం సమ్మక్క సారక్కల వద్దకు బస్సులు నడుపుతామని వివరించారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.