
మత్తు అనర్థాలపై అవగాహన ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి
నిర్మల్‌టౌన్: మాదకద్రవ్యాల వాడకంతో కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు కు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. మత్తు పదార్థాలను వాడినా, వాటిని సరఫరా చేసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ఏఎస్పీ రాజేశ్‌మీనా, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, న్యాయవాదులు, అధ్యాపకులు పాల్గొన్నారు.