
ఇందిరమ్మ ఇళ్లు సక్రమంగా నిర్మించాలి
● హౌసింగ్ డీఈ దయానంద్
ముధోల్: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయిన లబ్ధిదారులకు తాపీ మేసీ్త్రలు సక్రమంగా నిర్మించాలని హౌసింగ్ డీఈ దయానంద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తాపీ మేసీ్త్రలు ఇసుక, సిమెంటు సరైన మోతాదులో కలిపి నాణ్యత లోపించకుండా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు 65 గజాలలోపే ఇంటిని 600 చదరపు గజాల్లో నిర్మించేలా చూడాలన్నారు. ఈమేరకు మేసీ్త్రలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈలు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.