జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి | - | Sakshi
Sakshi News home page

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి

Jun 27 2025 4:10 AM | Updated on Jun 27 2025 4:10 AM

జూపల్

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి

● చూసేందుకు ఎన్నో ఉన్నా.. టూరిజం అభివృద్ధి సున్నా.. ● ‘బాసర’ నిధులూ.. వెనక్కి రావాలి.. ● సంక్షేమంతోపాటు.. టూరిజంపైనా దృష్టిపెట్టాలంటున్న జిల్లా వాసులు ● నేడు జిల్లాకు రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు రాక

నిర్మల్‌: రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి శుక్రవారం నిర్మల్‌ జిల్లాలో అధికారిక పర్యటనకు వస్తున్నారు. కలెక్టరేట్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటా రు. జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించాలని స్థానికులు ఆశిస్తున్నా రు. గోదావరి నది, సహజ సిద్ధమైన జలపాతాలు, చారిత్రక స్థలాలు వంటి అనేక ఆకర్షణలు ఉన్నప్పటి కీ, జిల్లా పర్యాటక రంగం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ సందర్భంగా, మంత్రి జూపల్లి నాయకత్వంలో ఈ రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యానికి గురైన బాసర

బాసర, దేశంలోనే ప్రముఖ చదువుల క్షేత్రంగా పేరుగాంచిన ప్రదేశం. గోదావరి నది ఒడ్డున అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రం, పర్యాటక రంగంలో గణనీయమైన అభివృద్ధిని ఆశిస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం చేపట్టిన కొన్ని అభివృద్ధి పనుల తర్వాత, ఇక్కడ పెద్దగా పురోగతి కనిపించలేదు. గత ప్రభుత్వం కేటాయించిన రూ.50 కోట్ల నిధుల్లో కొంత భాగం మాత్రమే ఖర్చు చేయగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు, జూపల్లి ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన సందర్భంగా, ఈ నిధులను పునరుద్ధరించి, బాసరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రతిపాదనల్లోనే పోచంపాడ్‌ – బాసర బోటింగ్‌..

గత ప్రభుత్వం టెంపుల్‌ టూరిజం భాగంగా, నిజామాబాద్‌ జిల్లాలోని పోచంపాడ్‌ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో బాసర క్షేత్రం వరకు బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

హామీగానే ‘గడ్డెన్న’ ప్రాజెక్టు

భైంసా పట్టణాన్ని ఆనుకుని ఉన్న సుద్ధవాగుపై గడ్డెన్నవాగు ప్రాజెక్టు, బోటింగ్‌, పార్కు వంటి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏళ్లుగా చెబుతున్నారు. కానీ, ఈ దిశగా ఇప్పటివరకు గట్టి చర్యలు తీసుకోలేదు, ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు.

ఇప్పుడే అవకాశం..

గతంలో ‘దక్షిణ కశ్మీరం’గా మార్చుతామని, ‘టూరి జం సర్క్యూట్‌’గా అభివృద్ధి చేస్తామని పలు హామీ లు ఇచ్చినా, అవి నీరుగారిపోయాయి. ఇప్పుడు, పర్యాటక శాఖ మంత్రిగా, జిల్లా ఇన్‌చార్జిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించడంతో, జిల్లా పర్యాటక రంగంలో కొత్త ఒరవడి సృష్టించాలని స్థానికులు కోరుతున్నారు. ‘జూపల్లిగారూ, పర్యాటకశోభ తీసుకురండి’ అని విన్నవిస్తున్నారు.

‘కడెం’

అందాల నిరాదరణ

వాస్తాపూర్‌ జలపాతం..

చారిత్రక నిర్మల్‌..

పచ్చని అడవుల మధ్య నిండుకుండలా ఆకర్షించే కడెం ప్రాజెక్టు, పర్యాటకులను ఆకట్టుకునే అనేక అందాలను కలిగి ఉంది. అయితే, రెస్టారెంట్‌, బోటింగ్‌ వంటి కనీస సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్కడి పర్యాటక రంగానికి అడ్డంకిగా మారింది. ఈ ప్రాంతాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తే, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మామడ మండలం వాస్తాపూర్‌ జలపాతం, పచ్చని అడవుల మధ్య సహజ సిద్ధమైన అందాలతో ఆకర్షిస్తుంది. కుటుంబ సమేతంగా సందర్శించడానికి అనువైన ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోవడం పర్యాటకులకు ఇబ్బందిగా మారుతోంది. రోడ్లు, వసతి గృహాలు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలను కల్పిస్తే, ఈ జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

చారిత్రక పట్టణమైన నిర్మల్‌లో బూరుజులు, గఢ్‌లు, శ్యాంగఢ్‌, బత్తీస్‌గఢ్‌, గజ్‌గఢ్‌, దసరా బూరు జు వంటి చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. అయి తే, ఈ స్థలాలు నిర్లక్ష్యానికి గురై, కొన్ని కబ్జాలకు లోనవుతున్నాయి. సర్ద్‌మహల్‌ వంటి ప్రత్యేక నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. 13 చెరువులు ఉన్న ఈ పట్టణంలో బోటింగ్‌ లేదా ఆహ్లాదకరమైన పార్కులు కూడా లేని దుస్థితి నెలకొంది.

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి1
1/3

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి2
2/3

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి3
3/3

జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement