
ధాన్యం దోపిడీపై విచారణ జరిపించాలి
వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్ల వరకు సంచికి 5–6 కిలోల ధాన్యం దోపిడీ జరుగుతోంది. అధికారులు, గత ఇన్‌చార్జి మంత్రికి తెలిపినా ఫలితం లేదు. 12శాతం డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలి. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రైతుభరోసా నిధులు రూ.200 కోట్లు చెల్లించకుండా సంబరాలు చేసుకోవడం విడ్డూరం. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు కలిగిన రైతులు బోర్లు వేసుకునేందుకు, కరెంట్ పొందేందుకు అనుమతించాలి. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే