
పీజీ లాసెట్‌లో ప్రతిభ
లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన పీజీ లా సెట్–2025 ఫలితాలలో లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సహస్ర చందన అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 190వ ర్యాంకు సాధించింది. మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ అధ్యాపకుడు ప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మంజుల దంపతుల కుమార్తె అయిన సహస్ర చందన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత అంబేద్కర్ లా కళాశాలలో లా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పీజీ సెట్‌లో 190 ర్యాంక్ సాధించింది. తమ కుమార్తె రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు అనందం వ్యక్తం చేశారు.