
స్థలం కేటాయించాలని వినతి
నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయం కోసం స్థలం కేటా యించాలని సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కోరారు. బుధవా రం కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. టీజీవో సంఘం జి ల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజీ రెడ్డి, కార్యదర్శి దా త్రిక రమేశ్, అసోసియేట్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి సుదర్శన్, ప్రచార కార్యదర్శి విష్ణువర్ధన్, కార్యాలయ కార్యదర్శులు రాజమల్లు, క్రాంతికుమార్, వినోద్‌కుమార్, శ్రీహరి, జీవరత్నం తదితరులున్నారు.