● ‘హస్తం’లో గ్రూపు విభేదాలు ● నామినేటెడ్, పార్టీ కమిటీల నియామకాల్లో జాప్యం ● ముంచుకొస్తున్న ‘స్థానిక’ సమరం ● నేడు ఆదిలాబాద్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ● రెండు రోజుల పాటు ఇక్కడే.. ● ఆయన వెంట మంత్రి వివేక్ కూడా..
సాక్షి, ఆదిలాబాద్: ‘పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశపర్చొద్దు.. సమన్వయంతో ముందుకు సాగా లి.. ప్రభుత్వ పదవులను శ్రేణులకు ఇప్పించడంలో జాప్యం అయితే ప్రయోజనమేంటి.. ఆలయ, మా ర్కెట్ కమిటీలు వంటి పదవులు నేరుగా నేను ఇవ్వలేను.. ఇన్‌చార్జి మంత్రులు, షార్ట్‌లిస్ట్ చేసి పంపితే ఫైనల్ మాత్రమే చేయగలుగుతాను.. నామినేటెడ్‌తో పాటు పార్టీ కమిటీలు వేయడంలో ఇక ఆలస్యం వద్దు.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలి.. అది జరిగితే త్వరగా ఫైనల్ చేయవచ్చు..’ ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీపీసీ సీ పీఏసీ భేటీలో అన్న మాటలు. ప్రస్తుతం ఇవి ప్రా ధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ఇన్‌చా ర్జి మంత్రులకు ప్రస్తుతం పార్టీ పరంగా వీటన్నింటి ని సరిదిద్ది, గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది.
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎకై ్స జ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. నేడు, రేపు ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఉమ్మడి జిల్లా అధి కారులతో సమీక్షతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నా రు. అలాగే ఇన్‌చార్జి మంత్రికి తొలుత పార్టీ సంస్థాగత నిర్మాణం, నామినేట్ పదవుల పందేరం, స్థాని క సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయ డం ముందున్న బాధ్యత. సీఎం ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు దృష్టి సారించాలని ఆదేశించ డం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నే పథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన తక్ష ణం దృష్టి సారించాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో గ్రూపు విభేదాలతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో మంత్రి వీటన్నింటినీ ఎలా గాడిలో పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కార్యకర్తల్లో తాము అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం కని పించడం లేదు. అధికారుల వద్ద తమ పనులు కాకపోవడం కూడా ఈ నిరాశకు కారణం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉత్సాహం తీసుకురావడం ప్రస్తుతం ఇన్‌చార్జి మంత్రికి కీలకం కానుంది.
సమన్వయం సాధించేనా..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలున్నాయి. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది. గతంలో ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్క వీరందరినీ సమన్వయ పర్చడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా ఆమె అసలు పట్టించుకోలేదని నేరుగా జిల్లా నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ముందు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ప్రస్తావించా రు. ఆ సమయంలోనే తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించలేనని, తప్పుకొంటానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అ ప్పట్లోనే ఆమె పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత పరిణామ క్రమంలో నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి గా వ్యవహరిస్తున్న మంత్రి జూపల్లిని ఆదిలాబాద్ కు, సీతక్కను నిజామాబాద్‌కు మార్చారు. ఈ పరి స్థితుల్లో మంత్రి జూపల్లి తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో సమన్వయం ఎలా సాధించాలనే విషయంలో ఆయన ఎలా ముందుకెళ్తారనేది కీలకంగా మారింది. ఇక చెన్నూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంత్రి హోదాలో ఆయన కూడా గురువారం నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి రానున్నారు.
సమన్వయం.. సవాలే!
సమన్వయం.. సవాలే!