
గంజాయి నిర్మూలన అందరి బాధ్యత
నిర్మల్‌టౌన్: గంజాయి నిర్మూలన అందరి బాధ్య త అని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మా ట్లాడారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చే యాలని, ‘మిషన్ గంజా గస్తీ’ ప్రోగ్రాంను పక్కగా అమలు చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే వెంటనే 8712659599 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట ఆన్‌లైన్‌లో వీడియో కాల్ చేసి పోలీస్ అధికారులమంటే న మ్మవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురై తే గంటలోపే 1930కు కాల్ చేయాలని లేదా https:// www. cybercrime. gov. inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీ రోజు సాయంత్రం డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. వాహనాల ఫే క్ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించా రు. అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్ మీనా, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, మల్లేశ్, సమ్మయ్య, ఎస్‌హెచ్‌వోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
● నేర సమీక్షలో ఎస్పీ జానకీ షర్మిల