
‘ప్రైవేట్’కు దీటుగా విద్యనందించాలి
సోన్: ‘ప్రైవేట్’కు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం సోన్ కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లు, తరగతిగదులు, వసతి గృహం, మరుగుదొడ్లు, భోజనశాల, స్టోర్‌రూమ్ ను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినుల హాజరు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ప్రతీరోజు శుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్య మైన భోజనం అందించాలని సూచించారు. అంతకుముందు పదో తరగతి విద్యార్థినుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. పాఠ్యపుస్తకాలు, నో టుబుక్స్, యూనిఫాంలు అందాయా? అని ఆరా తీశారు. లక్ష్యంతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాధించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రామారావు, తహసీల్దార్ మల్లేశ్‌రెడ్డి, ఎంపీడీవో సురేశ్, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, సలోమి, లింబాద్రి, ప్రవీణ్, హెచ్‌ఎం లతాదేవి, ఉపాధ్యాయులున్నారు.