
ఒకే ఉపాధ్యాయుడు.. 90 మంది విద్యార్థులు
ఖానాపూర్: మండలంలోని బీర్నంది ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో 94 మంది విద్యార్థులకు ఒకే ఉ పాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో రెండు పోస్టులు ఉన్నప్పటికీ మరో ఉపాధ్యాయురాలు శ్రీదేవి పాఠశాల ప్రారంభించిన రెండోరోజే ఆరు నెలల ప్రసూతి సెలవులో వెళ్లారు. బీ ర్నంది పంచాయతీ పరిధిలోని గ్రామాలతోపాటు రంగపేట గ్రామం నుంచి విద్యార్థుల సంఖ్య ఈ బ డికి గణనీయంగా పెరిగింది. ఐదు తరగతులు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తోంది. కాగా, మండలంలోని సుర్జాపూర్ పంచాయతీ పరిధిలోగల బుడగజంగంవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు న్నారు. మండలంలోని పలు చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.