
నిర్మల్
మలేషియా జైలు నుంచి..
ఉపాధికోసం మలేషియా వెళ్లిన లింగాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడి జైల్లో మగ్గారు. ఎట్టకేలకు వారు జైలు నుంచి తిరిగి స్వగ్రామానికి చేరారు.
8లోu
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025
అన్నదాతకు బాసటగా
‘రైతు భరోసా’
నిర్మల్‌చైన్‌గేట్: వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి నిధులు ఖాతాల్లో జమ చేస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు. సోమవారం నాటికి జిల్లాలో మొత్తం రూ.260.80 కోట్లు జమయ్యాయని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1,86,400 మంది రైతులు ఉండగా, 1,85,116 మంది ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు చేరాయని తెలిపారు. మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమవుతాయని పేర్కొన్నారు.
గుర్తించిన
తయారీ కేంద్రం
కొయ్య బొమ్మలు.. వ్యవసాయం.. నిమ్మ రాజుల చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ జిల్లా కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఒకవైపు మత్తు పదార్థాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. ఇంకోవైపు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు పెరుగుతున్నాయి. ఇక తాజాగా కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. ఇక మత్తు పదార్థాల తయారీకి కేంద్రంగా మారింది. జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మారుస్తామని కలెక్టర్, ఎస్పీ ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు దందా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. జిల్లా అధికారులు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా.. అసాంఘిక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. – నిర్మల్
ఇటీవల
ఆల్ఫ్రాజోలంతో పట్టుబడిన
నిందితుల
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. యువత గంజాయి, కొత్త డ్రగ్స్ మత్తులో మునిగి, వాటిని దందాగా మార్చుకుంటోంది. మత్తులో తామేం చేస్తున్నారో తెలియక, ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. గంజాయి దందా జిల్లా నలుమూలలకూ విస్తరించింది. యువతను బానిసలుగా, విక్రేతలుగా మార్చుతోంది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టినా ఈ అక్రమ దందాకు చెక్ పడడం లేదు. యువత భవిష్యత్తును కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లోరోహైడ్రేట్ తయారీ ఇక్కడే..
చెట్ల నుంచి సహజంగా రావాల్సిన కల్లు చేతుల్లోనే త యారవుతోంది. తాటి, ఈత చెట్లతో సంబంధం లే కుండానే సీసాల్లో చేరుతోంది. ఇప్పటిదాకా క్లోరో హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం వంటి నిషేధిత మత్తుపదా ర్థాలను తీసుకువచ్చి, ఇక్కడ కృత్రిమ కల్లును త యారు చేసేవారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చి న విషయమేమంటే జిల్లాలోనే కల్లు తయారీకి ము డిపదార్థమైన క్లోరోహైడ్రేట్‌నే ఇక్కడే తయారు చే స్తుండటం. నిర్మల్‌రూరల్ మండలం చిట్యాలవద్ద వ్యవసాయక్షేత్రంలోని ఓ గదిలో గుట్టుగా క్లోరోహైడ్రేట్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారులు మూడురోజుల క్రితం దాడి చేశారు. బుర్ర రమేశ్‌గౌడ్, రామాగౌడ్‌తోపాటు శ్రీనివాస్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్, రాజుగౌడ్ దీనిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ముంబైలోని భీవండి ప్రాంతం నుంచి క్లోరో అనే ద్రవపదార్థాన్ని తీసుకువచ్చి, దానిని గడ్డకట్టించి, క్లోరోహైడ్రేడ్‌గా తయారుచేస్తున్నారు. చిట్యాలలో 425 కిలోల క్లోరోహైడ్రేట్, పదికిలోల వరకు ఆల్ఫ్రాజోలం పట్టుకున్నారంటే.. జిల్లాలో ఎంత భారీమొత్తంలో కల్తీకల్లు దందా నడుస్తుందో అర్థంచేసుకోవచ్చు.
చైన్‌స్నాచింగ్‌లు, గంజాయి బ్యాచ్‌లు
జిల్లాలో ఇటీవల కాలంలో కలవర పెడుతున్న మ రో రెండు విషయాలు చైన్‌స్నాచింగ్‌లు, గంజాయి అమ్మకాలు. పల్లె పట్నం తేడా లేకుండా అంతటా ఇ వి రెండూ పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నా.. ఇవి కొనసాగుతూనే ఉండటం ప్రజలను కంగారు పెడుతున్నాయి. గంజాయి దందా జిల్లా నలుమూలలా విస్తరించి యు వతను మత్తుకు బానిసలుగా మార్చడమే కాకుండా, వారినీ విక్రేతలుగా మారుస్తుంది. ఇటీవల ఒకేరోజు భైంసా, నిర్మల్ రెండు మున్సిపాలిటీల్లో చైన్‌స్నాచింగ్‌లు కావడం సంచలనంగా మారింది. ఇలా ఏదో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
పోలీసులకు సవాల్..
ఒక దిక్కు కలెక్టర్, ఎస్పీ సహా అధికారులంతా మ త్తుపదార్థాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా రు. మరోవైపు.. గంజాయి సహా అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరుగుతూ వారికి పెనుసవాల్‌గా మారుతున్నాయి. మత్తుపదార్థాలపై పోరు చేస్తున్న ఈవారంలోనైనా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
రెచ్చిపోతూనే ఉన్న చైన్‌స్నాచర్లు
ఇటీవల కొత్తగా కిడ్నాప్‌లు..
గంజాయి మత్తులో యువతరం
తాజాగా వెలుగులోకి మత్తుమందు తయారీ..
పోలీసులకు సవాల్
కొత్తగా కిడ్నాపులు..
జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా కొత్తగా కిడ్నాప్‌లూ జరుగుతుండడం కలవర పెడుతోంది. ఇటీవల మామడ మండలం పొన్కల్ నుంచి సీనియర్ నేత చిక్యాల హరీశ్‌రావును కిడ్నాప్ చేసిన ఆయన వాహనంలోనే తీసుకెళ్లడం, తూఫ్రాన్ టోల్‌ప్లాజా వద్ద ఆయన తప్పించుకోవడం, తీరా.. పోలీసుల విచారణలో గతంలో ఆయన వద్ద పనిచేసిన వ్యక్తే నిందితుడుగా తేలడం అంతా.. సినిమాను తలపించింది. ఇక మెదక్ జిల్లాలోనే భైంసా పోలీసులపై జరిగిన దాడి ఘటనలో పట్టణం నుంచి ఓ బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.
కఠిన చర్యలు చేపడుతున్నాం..
గంజాయి, చైన్‌స్నాచింగ్ సహా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుశాఖ తరపున కఠినంగా వ్యవహరిస్తున్నాం. రెండు నెలల్లోనే 23 మందిపై కేసులు నమోదుచేశాం. పలువురు చైన్‌స్నాచర్లనూ పట్టుకున్నాం. మత్తురహిత జిల్లా కోసం శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
–జానకీషర్మిల, ఎస్పీ