తలాపు
గోదావరి..
లోకేశ్వరం : గోదావరి నది సమీపంలో ప్రవహిస్తున్నా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక గ్రామాల చెరువులు నీటి చుక్క కోసం అలమటిస్తున్నాయి. ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) నిండుగా ఉండి, నీరు దిగువకు ప్రవహిస్తున్నా, సమీప గ్రామాల చెరువులు ఎడారులను తలపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నీటి కొరత తప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుప్త పథకం విజయం...
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని చెరువులను నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో గుప్త ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం వల్ల నందిపేట్ చెరువులు నిండుగా ఉండి, జలకళను సంతరించుకున్నాయి. అయితే, ఇదే గోదావరి నీరు సమీపంలోని నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని చెరువులకు, కుంటలకు అందడం లేదు. ఈ ప్రాంతంలోని చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. గుప్త వంటి ఎత్తిపోతల పథకాన్ని ముథోల్ నియోజకవర్గంలో కూడా నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
ఎస్సారెస్పీ సమీపంలోనే నీటి కష్టాలు
ఎస్సారెస్పీ సమీపంలో ఉన్న కుంటాల, లోకేశ్వ రం, బాసర, ముథోల్ మండలాల గ్రామాల్లో నీ టి సమస్య తీవ్రంగా ఉంది. గోదావరి నీరు ప క్కనే ప్రవహిస్తున్నా, ఈ గ్రామాల చెరువులకు నీరు చేరే మార్గాలు లేవు. దీంతో చెరువులు బో సిపోయి, ఎడారులను తలపిస్తున్నాయి. గుప్త వంటి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతంలో నిర్మిస్తామని గతంలో ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటనలు అమలుకు నోచుకోలేదు.
రైతుల ఆకాంక్ష...
ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ మండలాలపై దృష్టి సారించి, గుప్త వంటి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పైపుల ద్వారా గోదావరి నీటిని చెరువులకు చేర్చడం ద్వారా నీటి కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ముథోల్ నియోజకవర్గం గ్రామాల చెరువులను జలకళతో నింపాలని రైతులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
ముధోల్ నియోజకవర్గంలో చెరువులు నింపేందుకు గోదావరి నది ఒడ్డున లిఫ్ట్ నిర్మించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతుల డిమాండ్‌ను కూడా నివేదిస్తాం. నిధులు మంజూరు నిర్మాణం పనులను చేపడుతాం. చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందిస్తాం.
– అనిల్, ఇరిగేషన్ డీఈ
లిఫ్ట్‌లు నిర్మించాలి..
గోదావరిలో పుష్కలంగా నీరున్నా మా మండలంలోని చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. లిఫ్ట్‌ల ద్వారా చెరువులకు గోదావరి జలాలను మళ్లించాలి. మండలంలోని చెరువులు కుంటలు నింపితే ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. రైతుల కష్టాలు తీరుతాయి.
– గీజా భూమన్న, ధర్మోర
చుక్క నీరు చేరలే
లోకేశ్వరం చుట్టు పక్కల కుంటలు, చెరువులు కలిపి దాదాపు పది ఉంటాయి. చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. చెరువులు నిండితే ఆయకట్టు కింద పంటలు పండుతాయి. లోకేశ్వరం మండలంలోని చెరువులకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలిస్తే సమస్య అధిగమించ వచ్చు.
– ఎల్లయ్య, వట్టోలి.
ఎత్తిపోతల పథకం కోసం ఎదురుచూపులు
గోదావరి జలాలతో చెరువులు
నింపాలని డిమాండ్
చెరువులు ఎడారి
చెరువులు ఎడారి
చెరువులు ఎడారి