
పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
నిర్మల్ రూరల్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో డేస్‌స్కాలర్స్ విద్యార్థులను కూడా చేర్చాలని ప్రకటించడాన్ని ఖండించారు. ఇలా చేస్తే గ్రామాల్లో ఉన్న పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలను సెమీ గురుకులాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. బడుల్లో పర్యవేక్షణ భౌతిక వసతులు ప్రభుత్వం కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కా ర్డులపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులు, సీపీఎస్ తదితర అంశాలపై ప్రభుత్వం స్టాండ్ తెలుపాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, నాగయ్య, రాజేశ్వర్, గోవర్ధన్‌రావు, గంగాధర్, షేక్ ఫాజిల్, శ్రీని వాస్, వీరేశ్, లక్ష్మణ్, రాథోడ్ గణపతి పాల్గొన్నారు.