
చదువుకునే అవకాశం కల్పించాలి
నా చిన్నతనంలోనే అమ్మా నాన్నను కోల్పోయాను. నా పోషణ మా అమ్మమ్మ చూసుకుంది. ప్రస్తుతం ఆమెకు వయస్సు పైబడటంతో నా పోషణ భారంగా మారింది. నేను ఏడో తరగతి చదువుకోవాలనుకుంటున్నాను నాకు ప్రభుత్వ గురుకులం లేదా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించండి.
– కోడె మనోజ్, నర్సాపూర్(జి)
ఇల్లు క్యాన్సిల్ అయింది..
నేను దళితురాలిని. నాకు సొంతంగా ఇల్లు లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. లిస్టులో పేరు వచ్చింది. కొందరు నాయకులు కావాలనే మంజూరు అయిన ఇల్లు క్యాన్సిల్ చేయించారు. అధికారులు విచారణ న్యాయం చేయాలి.
– హేమలత, పాత మద్దిపడగ
ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అందించాలి
నా భర్త వెంకటేశ్ బహ్రైన్‌లో గతేడాది నవంబర్ 23 మరణించారు. ప్రభుత్వం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద వచ్చే సొమ్ము కోసం దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు ఈ స్కీం కింద వచ్చే సొమ్మును మంజూరు చేసి నన్ను ఆర్థికంగా ఆదుకోవాలి.
– లావణ్య, సారంగాపూర్

చదువుకునే అవకాశం కల్పించాలి

చదువుకునే అవకాశం కల్పించాలి