
మినీ గురుకులాలుగా ఉన్నతీకరించాలి
నిర్మల్ రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలను మినీ గురుకులాలుగా ఉన్నతీకరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీజీహెచ్‌ఎంల ప్రమోషన్లను వెంటనే జరిపించాలని, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ప్రమోషన్లతో భర్తీ చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం ప్రా రంభమైన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పో స్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, నాగయ్య, నాయకులు పరమేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.