
నిత్యావసరాలు అందజేత
ఖానాపూర్: పట్టణంలోని వాసవీమాత ఆలయంలో వాసవీ, వనితా క్లబ్‌ల ఆధ్వర్యంలో ఆదివారం ఓ ది వ్యాంగునికి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, నిత్యావసరాలు అందజేశారు. ఇద్దరు రైతులను సన్మానించి విత్తనాల ప్యాకెట్లు పంపిణీ చేశా రు. చెప్పులు కుట్టే పలువురికి గొడుగులు ఇచ్చారు. క్లబ్‌ల ఆధ్వర్యంలో డాన్ టూ డస్క్ కార్యక్రమాలు చేపడతామని క్లబ్ గోల్డెన్ స్టార్ అంచూరి శ్రీనివాస్, గవర్నర్ గట్టు రాణి తెలిపారు. మనోజ్, రాజేంద్రప్రసాద్, పవన్, జితేందర్, పద్మజ, రవీందర్, సతీశ్, సుధాకర్, స్వరూప, శ్రీలత, రమ ఉన్నారు.