
బడిబాట @ 2,632
నిర్మల్
అడవిలో యాంటీ పోచింగ్ షెడ్లు
అడవిలో వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్న యాంటీ పోచింగ్ సిబ్బందికి అటవీ శాఖ అధికారులు షెడ్లు నిర్మిస్తున్నారు. వారికి నివాస సౌకర్యం కల్పిస్తున్నారు.
● జిల్లాలో ముగిసిన కార్యక్రమం ● ఆశించిన స్థాయిలో ప్రవేశాలు ● ‘ప్రైవేట్’ నుంచి 464 మంది..
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
8లోu
గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే
భైంసాటౌన్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిశారు. రాజ్‌భవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. బాసర ఆలయ అభివృద్ధి, పుష్కరాలకు ఏర్పాట్లు, బాసర నుంచి మాహో ర్ వరకు జాతీయ రహదారి పొడిగింపు తదిత ర అంశాలను వివరించారు. ఆయన వెంట సి ర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీజే పీ లోకేశ్వరం మండలాధ్యక్షుడు సాయన్న, నాయకుడు గంగారెడ్డి తదితరులున్నారు.
నిర్మల్ రూరల్: రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట ముగిసింది. జిల్లాలో ఈ నెల 6న ప్రారంభమై 19వరకు కొనసాగింది. ప్రతీరోజు రాష్ట్ర విద్యాశాఖ అందించిన ప్ర ణాళిక ప్రకారం పండుగలా నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో, అధికారులు, మేధావులు, యువ త ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో కంటే భి న్నంగా ఈసారి ఉపాధ్యాయులు విద్యార్థులను ప్ర భుత్వ బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బడుల్లో వసతులు, ఏఐ బోధనతో తల్లి దండ్రులకు సర్కార్ బడులపై నమ్మకం పెరుగుతోంది. బడిబాట గడువు ముగిసినా.. ఈ నెలాఖరు వరకు మరిన్ని ప్రవేశాలు రాబట్టేందుకు జిల్లా వి ద్యాశాఖ అధికారులు, టీచర్లు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో వసతులు
పేద విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తోంది. ప్రతీ విద్యార్థికి ఏ టా రెండు జతల యూనిఫాంలు, పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తున్నారు. సన్నబియ్యంతో వండిన రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దూరప్రాంతాల విద్యార్థులకు రవాణా భత్యం చె ల్లిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పదో తరగతి పూర్తి చేసినవారికి ట్రిపుట్‌ఐటీలో ప్రవేశాల సమయంలో అదనంగా గ్రేస్ మార్కులు కలుపుతున్నారు. సర్కా రు బడుల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపడానికి ఇవి కారణమవుతున్నాయి. బడిబాట కార్యక్రమం నిర్వహించి సర్కారు బడుల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి, బడీడు పిల్లల వివరాలు సే కరించారు. తల్లిదండ్రులను చైతన్య పరుస్తూ.. కరపత్రాలు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టర్లు అంటించారు. ప్రవేశం పొందిన విద్యార్థుల కు పుస్తకాలు, రాత పుస్తకాలు అందించారు. విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, యువ త, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ప్రజలను భాగస్వాముల ను చేసి తల్లిదండ్రులు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపట్టారు. అందరి ప్రో త్సాహంతో ప్రవేశాల సంఖ్య పెరిగింది.
న్యూస్‌రీల్
జిల్లాకు సంబంధించిన వివరాలు
సోన్ మండలం మాదాపూర్‌లో బడిబాటలో పిల్లలతో ఉపాధ్యాయులు (ఫైల్)
జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు : 896
బడిబాటలో ప్రవేశాలు : 2,632
మొత్తం ప్రవేశాల సంఖ్య : 4,125
అంగన్‌వాడీల్లో ప్రవేశాలు : 1,493
సమష్టి కృషితోనే..
ఉపాధ్యాయులు, అధికారులు, యువత, వీడీసీ సభ్యుల సమష్టి కృషితోనే జిల్లాలో బడిబాట విజయవంతమైంది. నెలాఖరు వరకు మరిన్ని ప్రవేశాలు వచ్చే అవకాశముంది. సర్కారు బడుల్లోని సౌకర్యాలు, ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశాం. తల్లిదండ్రులు ప్రభుత్వ బడులపై పెట్టుకున్న విశ్వాసం నిలుపుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. – రామారావు, డీఈవో

బడిబాట @ 2,632