
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధనే లక్ష్యం
ఖానాపూర్: ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరా బా ద్ మండలాలకు చెందిన ప్రజలందరి సమష్టి సహకారంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సా ధనే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ కన్వీనర్ నంది రామయ్య, సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ వి శ్రాంతిభవనం ఆవరణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు సమాచార హక్కు చ ట్టం ద్వారా వివరాలు తెలుపుతూనే మరో వైపు తక్కువగా భూమి ఉందంటూ ప్రజలను తప్పుదో వ పట్టించడం సరికాదన్నారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే స్థలాభావం ఉందని తెలిస్తే భూమి కొనుగోలు చేసైనా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నాయకులు సాగి లక్ష్మణ్‌రావు, ఆకుల శ్రీనివాస్, బీసీ రాజన్న, కొండాడి గంగారావు, కొ క్కుల ప్రదీప్, గౌరీకార్ రాజు, ఎనగందుల నారా యణ, రాపెల్లి రవీందర్, ఉపేందర్, మహేందర్, సంతోష్, మనోజ్, శ్రావణ్ తదితరులున్నారు.