గోదావరి నది తల్లి.. తనను నమ్మిన వారిని ఒడిలో చేర్చుకుని, వారికి ఆసరాగా నిలిచి, జీవనోపాధి అందిస్తూ కాపాడుతుంది. లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ సస్యశ్యామలం చేస్తున్న ఈ నది సోన్ మండలం గాంధీనగర్ గ్రామంలోని 350 కుటుంబాలకు జీవనాధారమైంది. చేపల వేటను ప్రధాన వృత్తిగా భావిస్తూ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో జీవనం సాగిస్తున్న ఈ మత్స్యకారుల జీవనంపై సండే స్పెషల్ స్టోరీ. – లక్ష్మణచాంద/సోన్
నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, వారు తిరిగి వెళ్లకుండా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న గాంధీనగర్ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుటుంబాలే నేడు గాంధీనగర్ గ్రామ మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్నాయి.
ఊరంతా చేపల వేటే..
గాంధీనగర్ గ్రామంలో మొత్తం 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఎవరికీ వ్యవసాయ భూములు లేవు. దీంతో, గ్రామంలోని అన్ని కుటుంబాలు చేపల వేటను ప్రధాన వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నాయి. ప్రతీరోజు ఉదయం 5 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తెప్పలపై చేపల వేటకు వెళ్లి, ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య తిరిగి వచ్చి, పట్టిన చేపలను గ్రామంలోని ఒక వ్యక్తికి అమ్ముతారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఈ విధంగా గ్రామస్తులంతా కలిసి రోజుకు సుమారు ఒక టన్ను చేపలు పట్టి విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
వారానికి ఒకసారి చెల్లింపులు
గాంధీనగర్ మత్స్యకారులు తాము పట్టిన చేపలను కొనుగోలు చేసన వ్యక్తి వారం రోజుల తర్వాత, ఎవరు ఎన్ని కిలోల చేపలు అమ్మారో లెక్కించి డబ్బులు చెల్లిస్తారు. చేపల రకం, మార్కెట్ పరిస్థితులను బట్టి కిలోకు రూ.70 నుంచి రూ.80 వరకు ధర లభిస్తుందని గ్రామస్తులు తెలిపారు. రోజుకు ఒకరికి సగటున 5 నుంచి 10 కిలోల చేపలు దొరుకుతాయని వారు చెబుతున్నారు.
ఎండు చేపలతో అదనపు ఆదాయం
ప్రస్తుతం, రోజూ పట్టిన చేపలను వెంటనే అమ్ముతున్నారు. అయితే, జనవరి నెలలో చేపలు ఎక్కువగా లభిస్తాయి. అప్పుడు కొన్ని చేపలు అమ్మి.. మిగిలిన చేపలను కోసి, ఆరబెట్టి అరుగుగా తయారు చేస్తారు. ఈ ఆరబెట్టిన చేపలను ఇంటి ముందు లేదా డాబాలపై ఆరబెడతారు. గ్రామంలో ఎటు చూసినా ఆరబెట్టిన చేపల తోరణాలే కనిపిస్తాయి. ఇది గాంధీనగర్ గ్రామానికి ప్రత్యేకతను తెలియజేస్తుంది.
సహకార జీవనం..
గాంధీనగర్ గ్రామ మత్స్యకారుల జీవనం గోదావరి తల్లి ఒడిలో, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధారంగా సాగుతోంది. చేపల వేటను వృత్తిగా ఎంచుకుని, 350 కుటుంబాలు ఐకమత్యంతో జీవనోపాధిని పొదుతున్నాయి. ఈ గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తూ, సహకార జీవనం, స్వావలంబన శక్తిని చాటుతోంది.
రోజుకు 8 కేజీలు
నేను రోజూ ఉదయం 6 గంటలకు చేపలు పట్టడానికి గోదావరికి వెళ్తాను.8 గంటల వరకు చేపలు పడతా. రెండు గంటల సమయంలో 8 కేజీల చేపలు పట్టుకుని తిరిగి ఇంటికి వచ్చి గ్రామంలోనే అమ్మేస్తా. కేజీ చేపలు రకంను బట్టి రూ.70 నుంచి రూ.80 వరకు ఇస్తారు. ఇలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.
– బాలాజీ, మత్స్యకారుడు, గాంధీనగర్
గోదారమ్మను నమ్ముకున్నాం..
చేపల వేట చాలా కష్టమైన పని. కానీ మాకు ఈ పని తప్ప వేరే పని లేదు.. రాదు. మాకు ఎటువంటి వ్యవసాయ భూములు లేవు. చేపల వేటనే జీవనోపాధిగా మల్చుకున్నాం. గోదారమ్మను నమ్ముకున్నాం. కుటుంబ పోషణ కోసం కష్టమైనా చేపల వేట తప్పడం లేదు. ఆదాయ తక్కువే అయినా చేపలవేటతో ఉపాధి పొందుతున్నాం.
– సత్వాజీ, మత్స్యకారుడు, గాంధీనగర్
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి
● గాంధీనగర్‌కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి