యోగా జీవితంలో భాగం కావాలి | - | Sakshi
Sakshi News home page

యోగా జీవితంలో భాగం కావాలి

Jun 22 2025 4:08 AM | Updated on Jun 22 2025 4:08 AM

యోగా

యోగా జీవితంలో భాగం కావాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

దివ్య గార్డెన్‌ లో యోగా చేస్తున్న ఉద్యోగులు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా ప్రజలంతా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవా లని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. శనివా రం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని దివ్య గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ జూమ్‌ ద్వారా మాట్లాడారు. ప్రతీరోజు కనీసం 45 నిమిషాలు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. యోగా సాధనతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిశుమందిర్‌ విద్యార్థి రామ్‌కుమార్‌ మ్యాన్‌ కోడ్‌ ప్రక్రియ ద్వారా కళ్లకు గంతలు కట్టుకుని వస్తువులను గుర్తించిన విధానం విశేషంగా ప్రశంసలు అందుకుంది. రామ్‌ కుమార్‌ను అదనపు కలెక్టర్‌ సన్మానించి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సీపీవో జీవరత్నం, డీఈవో రామారావు, డీఎస్‌వో కిరణ్‌కుమార్‌, డీఎంహెచ్‌వో రాజేందర్‌, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఆయుష్‌ అధికారులు నారాయణరావు, సంధ్యారాణి, వెంకటేశ్వర్లు, శ్రవణ్‌కుమార్‌, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.

వృత్తిలో ఒత్తిడి దూరం..

నిర్మల్‌టౌన్‌: యోగా సాధనతో వృత్తిలో ఒత్తిడి తగ్గుతుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో యోగా దినోత్సవం నిర్వహించారు. 150 మంది సిబ్బందితో ఎస్పీ యోగా సాధన చేశారు. యోగా శిక్షకుడు, హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ పోలీస్‌ అధికారులకు, సిబ్బందితో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా, నడక వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సమ్మయ్య, ఆర్‌ఐలు రామ్‌ నిరంజన్‌, రమేశ్‌, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కోర్టు ఆధ్వర్యంలో...

ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. యోగాతో మానసిక శరీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ భవనంలో కోర్టు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఆసనాలు చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలో ఎంత అంతర్యం ఉందో.. అందులో యోగాకు ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక, శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

యోగా జీవితంలో భాగం కావాలి1
1/3

యోగా జీవితంలో భాగం కావాలి

యోగా జీవితంలో భాగం కావాలి2
2/3

యోగా జీవితంలో భాగం కావాలి

యోగా జీవితంలో భాగం కావాలి3
3/3

యోగా జీవితంలో భాగం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement