
భవనం ప్రారంభించక..
● వేధిస్తున్న అసౌకర్యాలు ● మరుగుదొడ్లు సరిపడా లేక అవస్థలు ● పెండింగ్‌లోనే తరగతి గదుల నిర్మాణ పనులు ● ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు ● సాక్షి విజిట్‌లో తేటతెల్లం
ఖానాపూర్: మండలంలోని బాదనకుర్తి ప్రాథమికోన్నత పాఠశాలకు గత ఏడాది రూ.కోటి నిధులతో నిర్మించిన నూతన భవనం ఉన్నప్పటికీ దానిని ప్రారంభించకపోవడంతో పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామంలో పురాతన భవనం ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో మండల అధికారుల సూచన మేరకు ఉపాధ్యాయులు విద్యార్థుల తరగతుల నిర్వహణను పురాతన భవనంలో కాకుండా సమీపంలోని ఇతర భవనాల్లో కొనసాగించాల్సి వస్తోంది.